ప్రోటోకాల్ పాటించినందుకు నిరసన తెలిపిన వైసిపి
ప్రయోజనాల కొరకు సమావేశం నుండి వాకౌట్ చేసిన సభ్యులు.
రౌతులపూడి
రౌతులపూడి మండల పరిషత్ కార్యాలయం సమావేశపహాలులో మండల పరిషత్ అధ్యక్షురాలు గంటిమళ్ల రాజ్యలక్ష్మి అధ్యక్షతన మండల అభివృద్ధి అధికారి ఎం గోవిందు ప్రారంభించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య వాయిదా పడడం జరిగింది. ఈ మధ్యకాలంలో మృతి చెందిన బలరామపురం సర్పంచ్ దాసరి సన్యాసి మరియు గిదజాం ఎంపీటీసీ యిజ్జపు సూర్య కళ లకు శ్రద్ధాంజలి కట్టించాలనే కనీస మానవత్వం కూడా చూపకుండా కొందరు సర్పంచ్ లు సభను వాకౌట్ చేయడం చాలా విచారకరమని సభకు హాజరైనఎంపీటీసీ సభ్యులు సర్పంచులు అధికారులు విచారణ వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదంపై జెడ్ పి టి సి గొల్ల లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో వైయస్సార్ పార్టీ ఎంపీటీసీలు సర్పంచ్ లు నిరసన తెలిపి సభకు సభకు రాకపోవడంతోవివిధ వాదనల మధ్య సభ వాయిదా పడింది. మొదటగా సభకు విచ్చేసిన ములగపూడి ఎంపీటీసీ యామాల సురేష్, రౌతులపూడి ఎంపిటిసి బీజారాజు, గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, ఉప్పంపాలెం సర్పంచ్ యనుముల కోటి బాబు ఎం కొత్తూరు సర్పంచ్ ల తో కలిసి గంటి మల్ల రాజ్యలక్ష్మి ఎంపీడీవో గోవిందు చనిపోయిన బలరాంపురం సర్పంచ్, గిడజం ఎంపీటీసీల ఫోటోలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం జరిగిన పరిణామాల మధ్య ఎంపీడీవో పోరం సభ్యులు లేరని సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో సమావేశంలో ఉన్న ములగపూడి ఎంపీటీసీ యామాల సురేష్ రౌతులపూడి ఎంపీటీసీ బీజారాజు కలిసి సమావేశం నిర్వహించాలని ఎంపీడీవోను కోరారు. సభలో పోరం సభ్యులు లేని కారణంగా ఏ విధమైన తీర్మానాలు ఆమోదం కానీ బడ్జెట్ ప్రవేశ పెట్టడం గాని జరగదని సభకు తెలిపారు. దీనితో ఎంతో సమయాన్ని వెచ్చించుకొని వచ్చిన అధికారులతో నైనా వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించాలని కోరగా మండల అధ్యక్షురాలు గంటిమల్లా రాజ్యలక్ష్మి సమీక్ష ప్రారంభించారు. మొదటగా వ్యవసాయ శాఖ మండల అధికారి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా, సబ్సిడీపై, ధాన్యం కొనుగోలు వంటి పనులు చేపట్టామని, అదేవిధంగా గత తుఫాను కారణంగా పాడిన పంటలు సర్వే కూడా నిర్వహించే ప్రభుత్వానికి నివేదిక పంపించామని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష చేపట్టగా ములకపూడి ఎంపీటీసీ యామల సురేష్ మాట్లాడుతూ సక్రమంగా వైద్యులు రావడం లేదని, సరైన సమయానికి హాజరు కావడం లేదని, దీనితో వైద్యు నిమిత్తం హాస్పటల్ వద్దకు వచ్చిన తీవ్ర నిరాశతోను వేదనతోను విధి తిరిగితున్నారని, అదేవిధంగా గ్రామాలలో తిరిగి వైద్య సహాయం చేయవలసిన 104 ఆశా వర్కర్ల బీపీలు చూసి మందులు ఇచ్చి పంపిస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. సమీక్ష జరుగుతుండగా వాక్ అవుట్ చేసిన వైయస్సార్ పార్టీ ఎంపీటీసీలు సర్పంచులు సమావేశపహాలు లోనికి ప్రవేశించి మహిళ అని కూడా చూడకుండా ఎంపీపీ రాజ్యలక్ష్మి పైన, ఎంపీడీవో గోవింద్ పైన తీవ్ర వాగ్వివాదానికి దిగారు. పోరం సభ్యులు లేకుండా సభను ఎలా నిర్వహిస్తున్నారని వారు గందరగోళం సృష్టించారు. దీనితో సభను వాయిదా వేసామని వివిధ శాఖలపై సమీక్ష మాత్రమే జరుగుతున్న వారిని ఎంపీడీవో వివరణ ఇవ్వగా సంతృప్తి చెందని వాకవుట్ చేసిన సభ్యులు జడ్పిటిసి లక్ష్మణమూర్తి ఎంపీపీ పైన విరుచుకుపడ్డారు. మేము లేకుండా సమీక్ష కూడా చేపట్టకూడదని వారు పట్టుబట్టడంతో చేసేది లేక ఎంపీడీవో సభను వాయిదా వేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించవలసిన సర్వసభ్య సమావేశం స్వప్రయోజనాల కొరకై వాయిదా పడడంతో సమావేశానికి వచ్చిన అధికారులు విస్తు పోయారు.