
కాకినాడ రూరల్ :కాకినాడలో ప్రముఖ పారిశ్రామిక సంస్థ నాగార్జున ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ యాజమాన్యం మార్పుతో “ఏఎమ్ గ్రీన్ అమోనియా” సంస్థ గా మారిపోయింది. ఈ మార్పు సమయంలో ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులను యధావిధిగా వాళ్ల పనులు వాళ్ళు చేసుకోవచ్చని ఏయం గ్రీన్ అమోనియా యాజమాన్యం తెలిపారు. కానీ ఇప్పుడు మొత్తం కార్మికులు అందరూ రాజీనామా చేసి. తామిచ్చిన అప్లికేషన్స్ ఫిల్ప్ చేసి.ఏయం గ్రీన్ అమ్మోనియా కంపెనీ కార్మికుల కింద జాయిన్ అవ్వాలని ఈ కొత్త సంస్థ పేర్కొంది. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ తో యాజమాన్యం కార్మికులు ఇప్పటికీ రెండు దఫాలుగా చర్చలు జరిపారు. మూడో దఫాగా జూలై 25న చర్చలు జరిగే వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని యాజమాన్యానికి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ తెలిపారు. అయినా ఈ విషయాన్ని యాజమాన్యం పట్టించుకోకుండా కార్మికులపై ఒత్తిడి తీసుకురావడంతో నిరసన చేపట్టిన కార్మికులు. దీనికి నిరసనగా కార్మికులందరూ ఫ్యాక్టరీ మొదటి గేటు దగ్గర నిరసనలు చేపట్టారు…

