చంద్రగిరి:
చంద్రగిరి మండలం, తొండవాడ గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం నుండి ఆదివారం వరకు 7 రోజులు శ్రీ పద్మావతి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ వారు నిర్వహిస్తున్న నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ ఎస్ ఎస్) స్పెషల్ క్యాంప్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ క్యాంపు ద్వారా తొండవాడ గ్రామ ప్రజలకు పరిసరాలు పరిశుభ్రత, ఇంటి వ్యర్థ పదార్థాలను సరైన పద్ధతిలో తొలగించే విధానాలు, ధూమపానం మరియు మద్యపానం వలన కలిగే ఆరోగ్య సమస్యలు, సెల్ ఫోన్ దుర్వినియోగం వలన వచ్చే సమస్యలను గురించి అవగాహన కల్పిస్తారు. అంతేకాక గర్భాశయ క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమంలో 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు కాలేజీ బోధన సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మరియ రోజమ్మ, ఎంపీడీవో డాక్టర్ వి.వి. సూర్య సాయి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శశికళ, సర్పంచ్ ఎం. దీపికా రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళి రెడ్డి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి.ఆర్.లీలావతి, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి.ముని రేఖ, పంచాయతీ కార్యదర్శి నశ్రీన్ బేగం పాల్గొన్నారు.