బుట్టాయగూడెం. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలవరం నియోజకవర్గనికి సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమును సాధారణ ఎన్నికల పరిశీలకులు ఎస్. ఎ రామన్, జల్లా ఎన్నికల పోలీసు పరిశీలకులు టి. శ్రీధర్ లు కలిసి పరిశీలించారు. కేఆర్ పురం, ఐటీడీఏ వద్ద వైటీసీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమును శనివారం ఆయా పరిశీలకులు సంయుక్తంగా పరిశీలించారు. దీనిలో భాగంగా నియోజకవర్గ పోలింగ్ కేంద్రాల వారిగా ఈ వి ఎమ్ ల కేటాయింపు, పోలింగ్ కేంద్రాలకు తరలించే ఈ వి ఎమ్ లు, వి వి పేడ్ లు భద్రపరిచే భద్రత ఏర్పాటు, అక్కడ నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించే రూట్ మ్యాప్ , భద్రత తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చూసుకోవాలని సూచించారు. కేంద్ర ఎన్నికల మార్గదర్శకల భద్రత తదితర అంశాలపై ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్ .ఎ .రామన్, ఎన్నికల పోలీసు పరిశీలకులు టి. శ్రీధర్ క్షేత్రస్ధాయి పరిశీలన చేశారు. కేఆర్ పురం లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిసిటేషన్ సెంటర్ను సందర్శించారు. వీరి వెంట పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఐటిడిఎ పివో యం. సూర్యతేజ, సంబంధిత అధికారులు ఉన్నారు.
