కదిరి :వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ కు మద్దతుగా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో స్థానిక కౌన్సిలర్ బండారు శివమ్మ మురళి ఆధ్వర్యంలో పట్టణ కౌన్సిలర్లు గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి గడపను సందర్శిస్తూ రాబోయే ఎన్నికలలో కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బి.ఎస్ మక్బూల్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా జగనన్న అందిస్తున్న సంక్షేమం అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు గుంపుగా వస్తున్నారని ఈ ఎన్నికలలో వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు జిలాన్, కిన్నెర కళ్యాణ్, యస్.కె. వలీ, ఓం ప్రకాష్, షాను, బొబ్బలి రవి, జగన్, సింగల్ విండో ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ శివశంకర్ నాయక్, నరసింహులు, నల్లభల్లే శంకర్, కుంట్లపల్లి లక్ష్మీనారాయణ, కుటాగుల సలీమ్, సైదాపురం రామాంజి తదితరులు పాల్గొన్నారు.