ప్రొద్దుటూరు :
స్థానిక మున్సిపల్ పరిధిలో ఒకటో వార్డు బొల్లవరం మహర్షి స్కూల్ దగ్గర స్థానిక శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం పో రెడ్డి సుజాత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి వార్డు ప్రజల, వైసీపీ కుటుంబ కార్యకర్తల మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం విశేషం, వార్డు ప్రజలు, వైసిపి నాయకులు,మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, మహిళలు పోరెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఆ భగవంతుని ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, కల్పించాలని, సామాజిక సేవలో మరిన్ని ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, తన శ్రేయోభిలాషులు, మిత్రులు, తదితరులు, శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు. ఈ జన్మ దిన వేడుకలలో కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, పో రెడ్డి కుమారులు సందీప్,పో రెడ్డి ప్రదీప్, కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్డి, కాకర్ల నాగ శేషారెడ్డి, గోన ప్రభాకర్ రెడ్డి, శౌరి సుభాష్ రెడ్డి సుభాష్ రెడ్డి, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, మహిళలు, వార్డు ప్రజలు, తదితరులు, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.