ప్రతి చోటా అద్భుత ఆదరణ, విశేష స్పందన..!!
“పులివర్తి నాని” గెలుపు ఖాయమంటున్న గ్రామస్తులు..!!
పులివర్తి వినీల్*.
రామచంద్రపురం
రామచంద్రాపురం మండలం, ఎన్ఆర్ కమ్మపల్లి పంచాయితీ ప్రజల అభిమానం వెలకట్టలేనిదని, ప్రతి ఇంటా అద్భుతమైన ఆదరణ చూపిస్తున్నారని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ అన్నారు. గురువారం “మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని”, “బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమాల్లో భాగంగా ఆయన మండల నాయకులతో కలిసి ఎన్ఆర్ కమ్మపల్లిలో పర్యటించారు. ప్రజలు ఆయనకు హారతులు పట్టి ఆహ్వానం పలికారు. వినీల్ ఇంటింటికీ తిరుగుతూ మినీ మేనిఫెస్టో లోని అంశాలపై అవగాహన కల్పించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఓటమికి కృంగి పోకుండా గడిచిన 5 ఏళ్లుగా నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న పులివర్తి నానిని భారీ మెజారిటీతో గెలుపించుకుంటామని ఎన్ఆర్ కమ్మపల్లి ప్రజలు వినీల్ కు భరోసా ఇచ్చారు. ఈ 5ఏళ్లలో పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు పెరుగుదల, కరెంట్, పెట్రోల్, డీజిల్ ధరలు మోత.. చెత్త పన్ను వంటి వాటితో నిరుపేద, మధ్యతరగతి వర్గాలు నలిగిపోతున్నాయని పులివర్తి వినీల్ అన్నారు. రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అలాగే చంద్రగిరిలో ఎమ్మెల్యేగా పులివర్తి నాని గారిని గెలిపించుకోవాలని వినీల్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేకల తిరుమలరెడ్డి, నాయకులు జనార్దన్ చౌదరి, టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు