ఏలేశ్వరం:-గత రెండు రోజులుగా బ్యాంక్ సెలవులతో సోమవారం తిరిగి ప్రారంభమైన బ్యాంక్ లు. ఉదయం 11 గంటల సిబ్బంది లేకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. వివరాల్లోకి వెళితే స్థానిక మెయిన్ రోడ్ లో ఉన్న యూనియన్ బ్యాంకు ఉదయం 10:30 కి తలుపులు తెరిచారు. అయితే నగదు జమ చేసుకునే సిబ్బంది మాత్రం ఉదయం 11 గంటల దాటిన రాకపోవడంతో ఖాతాదారులు బ్యాంకు వద్ద పడిగాపులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ ను సంప్రదించగా ఆయన సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకు సిబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించే చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.