Wednesday, May 7, 2025

Creating liberating content

తాజా వార్తలుఉజ్వల భవిష్యత్తుకు విద్య పాత్ర కీలకం

ఉజ్వల భవిష్యత్తుకు విద్య పాత్ర కీలకం

  • ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య.. సీఎం జగనన్న లక్ష్యం
  • తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
  • తిరుపతి రూరల్ మండలంలో నోట్ పుస్తకాల పంపిణీ

తిరుపతి రూరల్,

   ఉజ్వల భవిష్యత్తును రూపొందించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. పిల్లలు దేశానికి భావి పౌరులు.. వారి ఎదుగుదలలో విద్య ఆర్థిక, సామాజిక అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, రైటింగ్ ప్యాడ్స్, మెదడుకు పడునుపెట్టే ఫజిల్ షీట్ లను పంపిణీకి తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సోమవారం రెండో రోజు తిరుపతి రూరల్ మండలం పరిధిలోని పెరుమాళ్ళ పల్లి, పుదిపట్ల, చెర్లోపల్లి, పేరూరు, తుమ్మలగుంట, అవిలాల, సాయి నగర్, పద్మావతీ పురం, వేదాంతపురం పంచాయతీలలోని పాఠశాల విద్యార్థులకు అందజేశారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిల్లలకు స్వయంగా నోట్ పుస్తకాలను అందజేసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు సైతం కాబోయే ఎమ్మెల్యే అంటూ మోహిత్ రెడ్డితో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ఒక్కొక్కరు తీసుకుంటుండగా వారి నుంచి ఫోన్ తీసుకున్న మోహిత్ రెడ్డి గ్రూప్ సెల్ఫీ తీశారు. ఈ ఘటన చెర్లోపల్లి ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. ఆయా పాఠశాలలో విద్యాబోధన, క్రీడలు వంటి అంశాలపై ఆరా తీస్తూ మోహిత్ రెడ్డి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రభుత్వం పాఠశాలల ఆధునీకరణ, విద్యా బోధనలో మార్పులు, యూనిఫాం, బూట్లు ఇవ్వడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. చెర్లోపల్లి పాఠశాలలో విద్యార్థులతో కలిసి మోహిత్ రెడ్డి మధ్యాహ్న భోజనం తిన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో 395 పాఠశాలల్లో 23,150 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

             ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో మనిషికి తిండి, బట్ట, వసతితో పాటు విద్య అత్యంత ఆవశ్యకమని తెలిపారు. వాతావరణంలో మార్పులు, కోవిడ్ -19 మహమ్మారి, కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అనేక కారణాల వల్ల విద్యా రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఆరోగ్యకరమైన ఆలోచనలను పెంపొందించడం, అభిజ్ఞా సామర్థ్యాలను అభివృద్ధి చేయడం, అవసరమైన నైపుణ్యాలను అందించడం, మంచి మానవులుగా తీర్చిదిద్దడానికి నాణ్యమైన విద్య అవసరమన్నారు. నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికీ అందించేందుకు సీఎం జగనన్న సంకల్పించారని వివరించారు. దేశంలోనే రాష్ట్రాన్ని నూరు శాతం అక్షరాస్యత దిశగా చర్యలు చేపడుతున్నారన్నారు. అందుకు అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యా దీవెన, విద్యా కానుక వంటి పథకాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణతో చిన్నప్పటి నుంచి విద్య పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. మా తండ్రి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి చదువంటే ఎనలేని మక్కువ, చదువుకున్న వారంటే ఎంతో గౌరవమని వివరించారు. ఆయన అభిప్రాయాలకు అనుగుణంగా   తాను కూడా ఉన్నత చదువు అభ్యసించానని తెలిపారు. నియోజకవర్గంలో విద్యార్థులకు ఇతోధికంగా సాయం అందించాలని సంకల్పించి పుస్తకాల పంపిణీ చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ ప్రక్రియ దశాబ్ద కాలంగా కొనసాగుతోందన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article