ప్రజాభూమి సత్యవేడు
కార్గో సేవల మాసోత్సవల అవగాహన ర్యాలీలో ఆర్టీసీ డిఎం వెంకటరమణ.
ఆర్టీసీ సంస్థ అందిస్తున్న ఉచిత కొరియర్ డోర్ డెలివరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా సత్యవేడు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణ కోరారు.కార్గో సేవల మాసోత్సవలను పురస్కరించుకొని శనివారం సత్యవేడు పట్టణంలో దీనిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతూ కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువుగా తెచ్చేందుకు డోర్ డెలివరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అన్నారు.50 కేజీల బరువుతో బుకింగ్ చేసిన పార్సల్, కొరియర్లను ఇంటి వద్దకే చేర్చడం జరుగుతుందన్నారు.అయితే పార్సల్ కౌంటర్ నుంచి పది కిలోమీటర్ల పరిధిలోపే ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం ఉంటుందన్నారు.దీంతోపాటు పార్సల్ బుక్ చేయడానికి వినియోగదాలకు నగదు రహిత డిజిటల్ సేవలను ప్రవేశపెట్టినట్టు ఆయన గుర్తు చేశారు.పార్సల్ బుక్ చేసిన తర్వాత అది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ట్రాకింగ్ సిస్టం కూడా అందుబాటులోకి వచ్చింది అన్నారు.ఇదేగాక 12 టన్నుల వరకు సరుకు రవాణా చేయడానికి కిలోమీటర్ ప్రాతిపదికన ప్రైవేటు రవాణా చార్జీలు కన్నా అతి తక్కువ ధరలకు కార్గో వాహనాలను అద్దెకు ఇస్తామన్నారు.కార్గో ఏజెంట్గా చేరడానికి ఆసక్తి ఉన్నవారికి మండల పరిధిలో వెయ్యి రూపాయలు, పట్టణ మున్సిపాలిటీ పరిధిలో 2500 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించాల్సి ఉందన్నారు.ఈ నేపథ్యంలో బుక్ చేసిన మొత్తం అమౌంట్ కి 15 శాతం,డెలివరీ ఇచ్చే పార్సెల్ అమౌంట్ పై రెండు శాతం కమిషన్ ఇస్తామని ఆయన వివరించారు.ఆర్టీసీ యాజమాన్యం అందిస్తున్న కార్గో సేవలను సద్వినియోగం చేసుకొని ఆదరించాల్సిందిగా ఆయన కోరారు.అంతకుమునుపు పట్టణంలో నేతాజీ రోడ్డు,గాంధీ రోడ్డు,ఆర్టీసీ బస్టాండ్ తదితర మార్గాల్లో ఆర్టీసీ కార్మికులతో కలిసి డిపో మేనేజర్ వెంకటరమణ పార్సల్,కొరియర్ సర్వీసులపై ర్యాలీలో అవగాహన కల్పించారు.ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆర్టీసీ సిబ్బంది పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు పి ఆర్ మూర్తి,డిఎన్ వర్మ,ఏ ఎమ్ ఎఫ్ శ్రీనివాసులు,డిపో సెక్రటరీలు వి బాబు, వెంకటేశులు,ఎస్ ఎన్ బాబు,ఆర్.జయ కుమార్,గ్యారేజ్ సెక్రటరీ శేఖర్ పలువురు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.