బుట్టాయగూడెం
ఈనెల 15వ తేదీలోగా ఈ పంట నమోదు రైతుల ఈ కేవైసీ పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వై. రామకృష్ణ ఆదేశించారు.
మండలంలోని బూసరాజుపల్లి లో శుక్రవారం రామకృష్ణ ఈ పంట సూపర్ చెక్ రికార్డ్స్ పై క్షేత్ర పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ గ్రామ వ్యవసాయ అధికారులచే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ పంట నమోదు ప్రక్రియ జరిగినట్లు తెలిపారు. ఈ పంట నమోదు ద్వారా మండలంలో మొక్కజొన్న, పిసివి పొగాకు, నాటు పొగాకు, వైట్ బర్లి పొగాకు, చెరకు, తదితర పంటలను 9452 ఎకరాల్లో రైతులు సాగు చేసినట్లు తెలుస్తోందన్నారు. మండలంలో డి ఏ ఓ రామకృష్ణ మండలంలో 50 మంది రైతులకు చెందిన సాగు క్షేత్రాలను సందర్శించారు. ఈ క్రమంలో బూసరాజుపల్లిలో కరాటం జానకిరామ్ కు చెందిన సాగు క్షేత్రాన్ని సూపర్ చెక్ నిర్వహించారు. ఈయన వెంట కోట రామచంద్రపురం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ పీజీ బుజ్జిబాబు, మండల వ్యవసాయ అధికారిణి బి.సుమలత, ఆర్.బి.కె అసిస్టెంట్ టి. కుసుమ, తదితరులు ఉన్నారు