Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుఇర్షాద్ ను పరామర్శించిన కందికుంట

ఇర్షాద్ ను పరామర్శించిన కందికుంట

కదిరి :కదిరి పట్టణంలోని జౌక్ పాళ్యం వీధికి చెందిన ఇర్షాద్ అనారోగ్య సమస్యతో బాధపడుతూ కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కదిరి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, టీడీపీ నాయకులు సలాం బీడీ ఇస్మాయిల్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఇర్షాద్ ఆరోగ్య సమస్యల గురించి వైద్యులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, కోలుకొని త్వరలోనే ఇంటికి వెళ్తారని వారు రోగికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article