ఈనెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు 11 రోజులపాటు అంగరంగ వైభవంగా కోటి పార్థివలింగాలతో మహా కుంభాభిషేక సహిత రుద్రాభిషేకం పోస్టర్ ఆవిష్కరించిన జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్జగ్గంపేట
జగ్గంపేట
జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం నందు కోటి పార్థివలింగాలతో మహా కుంబాభిషేకం పోస్టల్ ఆవిష్కరించిన జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 26వ తేదీ నుండి మార్చి 7 వ తేదీ వరకు ఇర్రిపాక శివాలయం వద్ద డిసెంబర్ 7వ తేదీ నుండి నిర్విరామంగా తయారవుతున్న కోటి మట్టి శివలింగాలతో మహా కుంభాభిషేక సహిత రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామని శృంగేరి పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతో ఈనెల 26వ తేదీ నుండి మార్చి7వ తేదీ వరకు 11 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో యావన్మంది భక్తులు పాల్గొని ఆ పరమశివుడు కృపకు పాత్రులు అవుతారని ఇక్కడకు వచ్చే భక్తులందరూ ఈ కోటి పార్దివ శివలింగాలను తమ స్వహస్తాలతో అభిషేకించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటివరకు ఒకే చోట తయారైన కోటి పార్దివ శివలింగాలతో ఒకే చోట మహా కుంభాభిషేకం నిర్వహించడం చరిత్రలో ఎప్పుడు జరగలేదని అటువంటి మహత్తర కార్యక్రమం ఇర్రి పాకలో జరుగుతుందని వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందించడం జరుగుతుందని కావున యావన్మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివుడి కృపకు పాత్రులు అవుతారని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర, ఎస్వీఎస్ అప్పలరాజు, కోర్పు సాయి తేజ, పోతుల మోహనరావు, చదరం చంటిబాబు, మంగ రౌతు రామకృష్ణ, కందుల చిట్టిబాబు, తోట రవి, తోట గాంధీ, వీరం రెడ్డి కాశి బాబు, కొత్తకొండ బాబు, అడబాల వెంకటేశ్వరరావు, కన్నబాబు, ఘాజింగం సత్తిబాబు, జాస్తి వసంత్, నీలం శ్రీను, ఉంగరాల రాము, పాఠం శెట్టి మురళీకృష్ణ, పైడిపాల సూరిబాబు, రేఖ బుల్లి రాజు, జంపన సీతారామచంద్ర వర్మ, సుంకవిల్లి రాజు, కందుల బాబ్జి, తూము కుమార్, అడబాల భాస్కరరావు, బదిరెడ్డి అచ్చన్నదొర, గుండా శివప్రసాద్, కుంచే రామకృష్ణ, కుంచె తాతాజీ, దాపర్తి సీతారామయ్య, కంచుమర్తి రా హుఘవ, బత్తుల సత్తిబాబు, వెలిశెట్టి శ్రీను, పోసిన ప్రసాద్, గోడే బాల, సలాపు నల మహారాజు, జగ్గంపేట నియోజకవర్గం టిడిపి సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.