పోరుమామిళ్ల:బద్వేలు వైసీపీ సమన్వయకర్త విశ్వనాథ్ రెడ్డి ఆద్వర్యంలో పోరుమామిళ్ల మండలం కొర్రపాటి పల్లె నుండి ముసలిరెడ్డిపల్లి వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా విశ్వనాధ్ రెడ్డి మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధమ్మను అత్యధిక మెజార్టీతో పిలుపిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్టుగా బద్వేల్ నుండి అందిస్తామన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి డిపాజిట్లు కూడా రావని ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి చెరగని ముద్రగా నిలిచాడు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ముందుగా కాలువ కట్ట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.