కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రయాణికులతో వెళుతున్న విమానం కూలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం తోప్‌ఖానా పర్వతాల్లో విమానం కూలినట్లు అధికారులు తెలిపారు. చైనా, తజికిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న బదక్షన్ ప్రావిన్స్‌లో విమానం కూలిపోయిందని అన్నారు. ప్రమాద స్థలం గురించి ఖచ్చితమైన సమాచారం లేదని అన్నారు. విమానం ఆచూకీ తెలియలేదని అన్నారు. అయితే ఆ విమానం భారత్ కు చెందినదంటూ జరుగుతున్న ప్రచారంపై డీజీసీఏ (డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పందించింది. ఆఫ్ఘనిస్థాన్ లో కూలిపోయిన విమానం భారత్ కు చెందినది కాదని డీజీసీఏ స్పష్టం చేసింది. ఆ విమానం మొరాకో దేశానికి చెందినదని వెల్లడించింది.
ఈ ఉదయం ఆఫ్ఘనిస్థాన్ లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో విమానం కూలిపోయిన ఘటనపై స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ విమానం ఢిల్లీ నుంచి మాస్కో వెళుతున్నట్టు ఆఫ్ఘన్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ కథనాలపైనే డీజీసీఏ స్పందించింది. అది మొరాకోకు చెందిన ఓ చిన్న విమానం అని తెలిపింది