జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ మదరస నిర్వాహకులు డాక్టర్ క్వారీ అబ్దుల్ సుభాన్, అబ్దుల్లా.
ఒంటిమిట్ట:
దైవ సంకల్పంతో ఏర్పాటు చేసే ఆధ్యాత్మిక సమావేశాల వల్ల లక్షలాదిమంది దయనందినియా జీవితంలో మార్పు రావడంతో పాటు సత్ప్రవర్తనతో మెలుగుతారని మనిషి జీవితంలో మార్పు వస్తుందని జామియా నూరుల్లా మదరస ఇస్లామిక్ ట్రస్ట్ నిర్వాహకులు ఆయుర్వేద వైద్యులు క్వారీ అబ్దుల్ సుభాన్ ఆయన కుమారుడు అబ్దుల్లా, అన్నారు శనివారం నాడు ఒంటిమిట్ట మండలం మలకాటి పల్లి వద్ద ఉన్న మద్రాసాలో వృద్ధులకు, వికలాంగులకు,అనాధలకు, నిరుపేదలకు,పెన్షన్ల, మరియు ధాన్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అలాగే నందలూరు సిద్ధవటం ఒంటిమిట్ట మండలాల లోని మసీదుల్లో విధులు నిర్వహిస్తున్న ఇమామ్, మరియు మౌజన్ లకు పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులకు ఆయుర్వేద మందులను ఉచితంగా అందజేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే గత నెల జనవరి 27,28, తేదీలలో జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ మదరస ప్రాంగణంలో జమాయెత్ నిర్వహించామని పదివేల మందికి పైగా హాజరు అయ్యారని భగవంతుని సూక్తులు విని దైవ ప్రార్థనలో పాల్గొని తరించారని అన్నారు ఈ దైవ సంకల్పంతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ముస్లిం పెద్దలు మరియు వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ జరిగే భయాన్ (అల్లా యొక్క మంచి మాటలు) విని దైవ ప్రార్థనలో పాల్గొని సత్ప్రవర్తనతో మెలగాలని ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలలో దైవం పై (అల్లా పై) ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ మార్గంలో నడవడిక సాగిస్తూ ఆకలితో ఉన్న పేదలను గుర్తించి పదిమందికి మేలు చేసేలా తమ జీవితాలను చక్కగా మలుచుకోవాలని సూచించారు. అలాగే ఇక్కడ మద్రాస ఏర్పాటు చేసినప్పటి నుండి నిరుపేదలైన చిన్నారులను అక్కునకు చేర్చుకొని మంచి విద్యాబుద్ధులు నేర్పి చామని అలా సత్ప్రవర్తనతో బయటికి పోయిన యువతీ యువకులు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శుక్రు సాహెబ్ , బిలాల్,వృద్ధులు,వికలాంగులు, నిరుపేదలు,ఇమాములు మోజోన్లు పాల్గొన్నారు.