Thursday, September 11, 2025

Creating liberating content

తాజా వార్తలుఆంధ్ర తెలంగాణ బోర్డర్లో కట్టు దీట్ట మైన భద్రత చర్యలు

ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో కట్టు దీట్ట మైన భద్రత చర్యలు

ఏలూరు డిఐజి అశోక్ కుమార్

ప్రజాభూమి, జీలుగుమిల్లి
ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో కట్టు దీట్ట మైన భద్రతా చర్యలు చేపట్టామని ఏలూరు డిఐజి జి వి జి అశోక్ కుమార్ అన్నారు. గురువారం జీలుగుమిల్లి మండలంలో గల స్థానిక సీఐ కార్యాలయంలో వార్షిక తనిఖీలు భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఆంధ్ర ప్రాంతం నుండి ఎటువంటి అక్రమ వలసలు గంజాయి మందు సారాయి లేకుండా నగదు మద్యం గంజాయి వంటివి తరలించకుండగా అత్యంత పకడ్బందీగా ఏర్పాటు చేశామని చెప్పారు . అందుకు ఎవరైనా పాల్పడినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . పోలీసు సిబ్బంది కూడా పలు సూచనలు చేశారు . ఏలూరు జిల్లాలోని తెలంగాణ సరిహద్దులో ఆరు చెక్ పోస్ట్ లను ఈనెల తొమ్మిదో తేదీన ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఇప్పటివరకు 34 ఐడిబి కేసు నమోదు చేశామని చెప్పారు ఇదేగాక 240 కేజీలు గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 240 కేసులను కార్బన్ చర్చ చేశామని వీరిని కూడా అప్రమత్తం చేశామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలోని ముఖద్వారంలో ఉన్న జీలుగుమిల్లి చెక్పోస్ట్ పై అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత మూడు సంవత్సరాల నుండి వివిధ కేసుల్లో ఉన్న ముద్దాయిలను పరిశీలన చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి చెక్ పోస్ట్ లో కూడా ఒక డిఎస్పి స్థాయి అధికారులు నియమించి విస్తృత తనిఖీలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పాత కేసులో ఉన్నటువంటి వారికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి జన స్తరవంతిలో కలిపేటందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దీని వెంట ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి, జీలుగుమిల్లి సిఐ బి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతంలోని ఏ ఏ ప్రాంతాలలో చెక్ పోస్టలుచేశాము ఎటువంటి కదలికలు ఉన్నాయో తీసుకుంటున్న చర్యలను మ్యాప్ ద్వారా ఆయన డి ఐ జి కి వివరించారు . మ్యాప్ పరిశీలన అనంతరం మరింత భద్రత చర్యలు తీసుకోవాలని సిబ్బందిని సూచించారు. ఎస్ఐ ఈ సందర్భంగా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article