Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై త్వరలోనే స్పష్టత: కేంద్ర మంత్రి అమిత్ షా

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై త్వరలోనే స్పష్టత: కేంద్ర మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: ఏపీలో పొత్తులు త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.న్యూఢిల్లీలో శనివారం నాడు ఓ పత్రిక నిర్వహించిన సదస్సులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ మిత్రులను తాము ఎప్పుడూ బయటకు పంపలేదన్నారు.రాజకీయ సమీకరణాల దృష్ట్యా వాళ్లు బయటకు వెళ్లారని …ఎన్‌డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని అమిత్ షా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌డీఏ విస్తరణ గురించి ఈ సమావేశంలో అడిగిన ప్రశ్నకు అమిత్ షా నవ్వుతూ సమాధానం చెప్పారు.టీవీ డిబేట్ వేదికగానే రాజకీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నారు. ఈ విషయమై తమకు కొంత సమయం ఇవ్వాలన్నారు. పొత్తులపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా ఎన్‌డీఏను విస్తరించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో దేశంలో 400కిపైగా పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలనే టార్గెట్ పెట్టుకున్నామని ఆయన చెప్పారు.బీజేపీకి 350 ఎంపీ సీట్లు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశం సంక్షేమం తిరిగి ఎన్‌డీఏలో చేరాలని పాత మిత్రులు భావిస్తే వారికి తలుపులు తెరిచే ఉంటాయని అమిత్ షా చెప్పారు.ఎన్‌డీఏను బలోపేతం చేసుకుంటామన్నారు.ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కుటుంబంలో కీలకమని చెప్పారు.ఫ్యామిలీ ప్లానింగ్ రాజకీయాల్లో మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత మంచిదన్నారు.పంజాబ్ లో పాత మిత్రులు అకాళీదళ్ తో కూడ పొత్తు పెట్టుకోబోతున్నామన్నారు. బీహార్ లో నితీష్ కుమార్ తిరిగి ఎన్‌డీఏలోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article