అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్,సిఐటియు ఆధ్వర్యంలో
మార్కాపురం
మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఈనెల 10, 11 తేదీల్లో జరుగుతున్నాయి. అవగాహన తరగతులను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసిడిఎస్ దేశంలోని గర్భిణీ మహిళలు రక్తహీనత , శిశు మరణాలను తగ్గించేందుకు, పౌష్టికారం అందించే పనిలో ఐసిడిఎస్ లోని అంగన్వాడీలు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. పనికి తగ్గ కనీస వేతనం కోసం రాష్ట్రంలో తమ హక్కుల కోసం తమ సమస్యల పరిష్కారం కోసం 42 రోజుల సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాటం చేసిన ఘనత ఒక అంగన్వాడీలకే మిగులుతుందని అన్నారు. సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాట తప్పితే మరింత స్ఫూర్తితో ఐక్యంగా పోరాటానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.ప్రపంచంలో ఆకలి చావులతో రక్తహీనలతో మరణాలలో భారతదేశం 107 స్థానంలో ఉండటం బాధాకరమని అన్నారు. శిశు మరణాలను తగ్గించేందుకు పనిచేస్తున్న ఐసిడిఎస్ పథకానికి మోడీ ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా, ఉన్న నిధులను తగ్గిస్తున్నారని ఆయన అన్నారు. బడ్జెట్లో నిధులు పెంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ తన తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో అంగన్వాడీలకు టిఏ, ఇంటి అద్దెలు, పెన్షన్, గ్రాడ్యుటి, వేతనాలు అసలు పెంచని ఏకైక ప్రభుత్వం మోడీ ప్రభుత్వంమే అని అన్నారు. తమ జీవితాన్ని పణంగా పెట్టి ప్రజల కోసం రాత్రనకా పగలనకా పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం అమానుషమని, సుప్రీంకోర్టు సైతం కార్మికులకు అనుకూలంగా తీర్పునిచ్చిన ప్రభుత్వాలు అమలు చేయకుండా తీర్పును తొక్కి పెట్టడాన్ని ఆయన విమర్శించారు. అవగాహన తరగతుల్లో భాగంగా మొదటి రోజు కేంద్ర,రాష్ట్ర ఆర్థిక విధానాలు- అంగన్వాడీలపై ప్రభావం అనే అంశంపై బోధించడం జరిగింది. సాయంత్రం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ అంగన్వాడీల పట్ల వివిధ రాజకీయ పార్టీల వైఖరులు అనే అంశాన్ని బోధించడం జరిగింది. ఈ క్లాసులకు ప్రిన్సిపల్ గా మున్నా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ, టౌన్ కార్యదర్శి పి రూబెన్, కంభం మండల కన్వీనర్ ఎస్.కె. అన్వర్, అంగన్వాడి యూనియన్ నాయకులు రమదేవి, వై సుబ్బమ్మ, మల్లేశ్వరి, వి నాగమణి, బి ఆదిలక్ష్మి, ప్రభావతి, లలితా, లక్ష్మీదేవి వెంకటరత్నం, భారతి, అరుణకుమారి, వ్యవసాయ కార్యదర్శులు జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా బాలనాగయ్య, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు జవాజి రాజు, జె నాగరాజు ,జి విక్టర్ తదితరులు పాల్గొన్నారు.