పెనుకొండ
అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, పెనుకొండ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కే.వి.ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గం లోని సోమందేపల్లి మండల కేంద్రంలోని లక్ష్మి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో వాలంటీర్లు, యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్టోర్ డీలర్లు ప్రజాప్రతినిధులుతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలును మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి మన జగనన్న ప్రభుత్వంకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా పని చేద్దామని పిలుపునిచారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వాల్మీకి శాంతమ్మ , సర్పంచ్ గంగాదేవి, ఎంపీపీ గంగమ్మ, జడ్పిటిసి అశోక్, కన్వీనర్ నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు రమాకాంత్ రెడ్డి, నాగభూషణ్ రెడ్డి, వెంకటరత్నం, ఎల్లారెడ్డి, లక్ష్మీనరసప్ప, రఫిక్, అస్వర్తమ్మ, జగదీష్ రెడ్డి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.