Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుఅయ్యప్ప భక్తులకు భిక్ష ఏర్పాటు

అయ్యప్ప భక్తులకు భిక్ష ఏర్పాటు

ప్రజాభూమి పులివెందుల టౌన్

పులివెందుల పట్టణంలోని మిట్ట మల్లేశ్వర స్వామి దేవస్థానం లో కార్తీక మాసం పురస్కరించుకొని అయ్యప్ప , శివ మాలధారణ చేసిన భక్తులకు మున్సిపల్ చైర్మన్ డా వరప్రసాద్ మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మునిసిపల్ ఇంఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి , సింగిల్ విండో ఈశ్వరయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు మఠం శివ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భిక్ష ఏర్పాటు చేసిన వరప్రసాద్ ను అయ్యప్ప సేవా సమితి సభ్యులు పూలమాల,దృశ్యాలవాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ అయ్యప్ప, శివమాల ధరించిన భక్తులకు కార్తీక మాసంలో భిక్షను ఏర్పాటు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు యర్వా వెంకట్ సుబ్బయ్య, రసూల్, కౌన్సిలర్లు కోడి రమణ, పార్నపల్లి కిషోర్, కో ఆప్షన్ మెంబెర్ దాసరి చంద్రమౌళి, డేరంగుల చంద్రమౌళి,డానియల్ బాబు, వేణు యాదవ్ , నాగరాజు ,ప్రశాంత్, రాజా తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article