Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుఅయోధ్య చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్

అయోధ్య చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్

దేశంలోని చారిత్రాత్మక ఆథ్యాత్మిక నగరం అయోధ్య ఒక ప్రత్యేకమైన శోభతో మెరిసిపోతోంది. అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో ఆథ్యాత్మిక శోభను సంతరించుకుంది. నగరం మొత్తం దేశం నలు మూలల నుంచి వచ్చిన భక్తులతో నిండిపోయింది. దేశంలోని ప్రముఖులు, సెటబ్రిటీలు అందరూ అయోధ్యలోనే ఉన్నారా? అనే పరిస్థితి అక్కడ ఉంది. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య ఎయిర్ పోర్టులో కార్యక్రమ నిర్వాహకులు వారికి స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో చిరంజీవి మాట్లాడుతూ… అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని .. ఎంతో భక్తితో కొలిచే హనుమంతుడే తనకు ఆహ్వానం పంపినట్టుగా ఉందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article