ప్రొద్దుటూరు
స్థానిక పట్టణం లో అమర్ జవాన్ స్థూపాన్ని సర్కిల్ ను ఏర్పాటు చేయాలని ప్రొద్దుటూరు డివిజన్ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు నేట్ల బాల వీరా రెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక కొర్రపాడు రోడ్డు లోని టిఎస్ఆర్ కల్యాణ మండపంలో డివిజన్ మాజీ సైనికులు,వీర మహిళల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి విచ్చేశారు. ఆయనను సంఘం తరపున ఘనంగా సన్మానించారు. అనంతరం బాల వీరారెడ్డి మాట్లాడుతూ మాజీ సైనిక సంఘానికి ఒక ఆఫీసు నిర్మించుకొనుటకు స్థలము, దేశ రక్షణ కోసం ఏండనక, వాననక,చలి అనక కుటుంబాలకు మరియు పుట్టిన ఊరికి దూరంగా వుంటూ, విధి నిర్వహణలో భాగంగా వీర మరణం పొందిన సైనికులను స్మరించు కొనుటకు ఒక అమర్ జవాన్ సర్కిల్ కావాలని కోరారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను అర్పించిన సైనికుల కోసం జమ్మలమడుగు నుండి మైదుకూరుకు పోయే బైపాస్ టివిఆర్ పెట్రోల్ బంకు వద్ద గల నాలుగు రోడ్ల సర్కిల్ నందు అమరవీరుల స్మారక సర్కిల్ గా త్వరలో చేస్తానని, ఒక ఆఫీసు నిర్మించుకోవడానికి ఐదు సెంట్లు అడిగినందుకు అందుకు ఐదు సెంట్లు కాకుండా 10 సెంట్ల స్థలాన్ని అందిస్తామని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు పీరయ్య, సెక్రటరీ శంకర్ రెడ్డి, ట్రెజరర్ సాంబశివరెడ్డి, జాయింట్ సెక్రటరీ రమేష్ బాబు, అడ్వైజర్స్ నెల్సన్, ఎల్లయ్య, సభ్యులు సుబ్బారెడ్డి, దస్తగిరి, మోహన్, హుస్సేన్ వలీ తదితరులు పాల్గొన్నారు.