మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడు
పోరుమామిళ్ల:
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోయినా పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ ప్రజలకు గడిచిన మూడేళ్ల పాలనలో నా వంతు కృషి చేశానని మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోరుమామిళ్ల మేజర్ పంచాయతీలో ప్రధాన సమస్యలైన త్రాగునీటి, డ్రైనేజ్, రోడ్లు, విద్యుత్, సమస్యలతో పాటు మరెన్నో ప్రజల సమస్యలు మరియు ముఖ్యంగా కార్మికుల సమస్యలు తదితర ఎన్నో సమస్యలు పరిష్కరించానన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడు మాట్లాడుతూ గడిచిన మూడేళ్ల పాలనలో ఆయన చేసిన అభివృద్ధి పనులను గురించి మాట్లాడుతూ ఫిబ్రవరి 9 నాటికి నేను సర్పంచ్ గా ఎన్నికైన అప్పటినుండి మూడు సంవత్సరాలు పూర్తవుతుందని నాటి నుండి నేటి వరకు పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు వెంటనే మోటార్లను రిపేరు చేయించడం కొత్త మోటార్లను వేయించడం ఏ వార్డులో తాగునీటి సమస్య లేకుండా చూశాను అన్నారు. ప్రతి వీధిలో డ్రైనేజీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజల సమస్యలను తీర్చానన్నారు. నేను సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టకు ముందు పోరుమామిళ్ల పంచాయతీ విద్యుత్ బకాయిలు 40 లక్షల పైగా ఉండగా నేను బాధ్యతలు చేపట్టాక చాలావరకు ఆ అప్పులను కూడా కట్టామన్నారు. ఎక్కడ విద్యుత్ సమస్య రానివ్వలేదన్నారు. అవసరమైన చోట సిసి రోడ్లు వేయించామన్నారు. పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైన నా సొంత డబ్బులు ఇచ్చి వారి సమస్యల్ని పరిష్కరించామన్నారు. కరోనా సమయంలో అన్ని వీధులలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం ఫాగింగ్ చేయించడం ఎటువంటి సమస్య రానివ్వకుండా చూశానన్నారు. లాక్ డౌన్ టైంలో నా సొంత డబ్బులతో ప్రజలకు నిత్యవసర సరుకులు కూరగాయలు అందించామన్నారు. వేసవిలో చలివేంద్రాలు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి ప్రజల దాహం తీర్చామన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు రూ 8000 వేతనం వుండగా వారికి రూ10000 వేతనాలు పెంచామన్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో నా వంతు కృషి ప్రజలకు ఎంతో చేశానని పేర్కొన్నారు. 2024లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపడుతుందని వచ్చే రెండు సంవత్సరాలలో ప్రజలకు మరింత సేవలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ మూడు సంవత్సరాలు నాకు సహకారం అందించిన అధికారులకి కార్మికులకి పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.