ప్రజా భూమి పోరుమామిళ్ళ :
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య నుండి వచ్చిన రాముల వారి అక్షింతలను శోభాయాత్ర అత్యంత వైభవోపేతంగా కాషాయ కండువలను ధరించి శనివారం రామనామ స్మరణతో మారుమోగింది ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ స్వామి శివరామనంద సరస్వతి వారు, రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి విశ్వ విందు పరిషత్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, జనహిత ఏకల్ అభియాన్ సమితి కార్యకర్తలు, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు, హైందవ ధార్మిక సంఘాల ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు. అయోధ్యలో జనవరి 22న రామ మందిరం ప్రతిష్ఠ మహోత్సవం సంద ర్భంగా దేశంలోని ప్రతి మండలానికి అక్షింతలు అందించాలనే సంకల్పం తో చేపట్టిన రామములవారి అక్షింతల శోభయాత్ర గిరి నగర్ రామాలయం నుండి మల్లకత్తవ ఆంజనేయస్వామి వరకు శోభాయాత్ర వైభవంగా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తాదులు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున అయ్యో నిండి వచ్చిన అక్షితలను తలపై పెట్టుకుని మేళతాళాలతో కోలాటాలతో ఆనంద ఉత్సవాలతో శోభయాత్ర సాగిందిసాగింది.
అయోధ్యరాముని చిత్రపటం, స్వామి వారి అక్షింతలను మేళతాళాల మధ్య అశేష జనవా హిని మధ్య భక్తులు శోభయాత్ర నిర్వహించారు.అంబేద్కర్ సర్కిల్ నుంచి సాగిన ఈ శోభయాత్రలో వచ్చిన అక్షింతలను భక్తులకు విశ్వ హిందూ పరిషత్, సంఘ్ పరివార్ సభ్యులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉల్లి బాల రంగయ్య, సెట్టెం చెన్నయ్య, బొల్లు రమణయ్య, కల్లూరి రామకృష్ణారెడ్డి, వెంకట్రాంరెడ్డి, తుపాకుల శ్రీనివాసులు, చిన్న కృష్ణయ్య, శ్రీ కోదండరామ దేవాలయ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, గిరి ప్రణీత రెడ్డి, ప్రగతి శ్రీనివాసులు, తులసి సురేష్ నాలుగు మండలాల భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.