తుని/కోటనందూరు
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ యనమల దివ్య జన్మదిన వేడుకలు తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి. కోటనందూరు మండలంలో స్థానిక కార్యకర్తలు ఏర్పాటుచేసిన దివ్య బర్తడే సెలబ్రేషన్స్ ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు హాజరయ్యారు. కేఈ చిన్నయ్య పాలెంలో
సీనియర్ నేత అంకం రెడ్డి రమేష్ ఆధ్వర్యంలో మండల టిడిపి అధ్యక్షుడు గాడి రాజబాబు అధ్యక్షతన యనమల దివ్య జన్మదిన వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన యనమల కృష్ణుడు కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్, దంతులూరిచిరంజీవి రాజు, బంటుపల్లి వెంకటేశ్వరరావు, పెన్మత్స నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా తుని పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో యనమల దివ్య బర్తడే సెలబ్రేషన్స్ జరిగాయి ముఖ్య అతిథులు చేసిన జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో పోల్నాటి శేషగిరిరావు, మల్ల గణేష్, కుక్కుడపు బాలాజీ, దిబ్బ శ్రీను, అల్లు రాజు, తదితరులు పాల్గొన్నారు