విజయవాడలో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వేలాదిగా మూడు పార్టీల శ్రేణులు తరలివచ్చి జయప్రదం చేసిన ఈ రోడ్ షో మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమై బెంజి సర్కిల్ వద్ద ముగిసింది. బెంజి సర్కిల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు, మహిళలకు ప్రధాని మోదీ అభివాదం చేశారు.కాగా, ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ పాల్గొన్న రోడ్ షోకు విశేష స్పందన లభించింది. అంచనాలకు మించి సక్సెస్ అయ్యిందన్న ఆనందం కూటమి నేతల్లో వెల్లివిరిసింది. ఈ రోడ్ షోతో ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం ముగిసినట్టయింది. రాష్ట్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే రోజున లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

