ప్రొద్దుటూరు :పట్టణంలోని స్థానిక జన విజ్ఞాన వేదిక కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి వేదిక కన్వీనర్ గంజికుంట నాగరాజు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకురాలు హరిత ,జన విజ్ఞాన వేదిక అధ్యక్ష కార్యదర్శులు సునీత ,రవి , ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక వెంకట్ నారాయణ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనం వివక్షతలపైన అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు ఇక్కడ జరుపుకోవడం ఎంతో ఆనందదగ్గ విషయమని,దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిదని, అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయిందని,డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా,సామాజిక సంస్కర్తగా భారతీయులకు, అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుందన్నారు.అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉందని. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడాయన అని అసమానతలు అంటరానితనం లేని సమాజం కోసం అహర్నిశలు కృషి చేశారనీ, అందరికీ ఓటు హక్కు కావాలని పోరాటం చేసి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నాయకులు చట్టాలను చుట్టాలుగా మార్చుకొని రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ప్రయత్నం చేస్తున్నారని అలాంటి వాటిని తిప్పి కొట్టే విధంగా అంబేద్కర్ గారి ఆశయ సాధనకోసం విద్యార్ధి యువత పాటు పడాలని ఆయన అడుగు జాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులతో పాటు తదితర లు పాల్గొన్నారు.