కనిగిరి
అందరూ సహకరించి వైసీపీని విజయ పదంలో నడిపించి తిరిగి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందిద్దామని కనిగిరి వైసీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు హనుమంతునిపాడు మండలంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హనుమంతునిపాడు మండలం నుంచి తనను జడ్పీటీసీగా అందరూ గెలిపించారని తిరిగి తనకు వైసిపి అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదాలతో ఒంగోలు టైగర్ బాలినేని శ్రీనివాసులు రెడ్డి సహాయ సహకారాలతో తన్ను వైసిపి ఇన్చార్జిగా ప్రకటించడం జరిగిందని ప్రతి ఒక్కరూ తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు యక్కంటి శ్రీనివాసులురెడ్డి, ఎంపీపీ గాయం సావిత్రి మాజీ ఎంపీపీ గాయం బలరామిరెడ్డి పి డి సి సి బ్యాంకు చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి కనిగిరి జడ్పిటిసి మడతల కస్తూరి రెడ్డి హనుమంతునిపాడు యూత్ అధ్యక్షులు భవనం కృష్ణారెడ్డి ఎస్సీ సెల్ అధ్యక్షులు గురు ప్రసాద్ సర్పంచుల సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి హెచ్ఎం పాడు సర్పంచ్ రాజారావు జే సి ఎస్ కన్వీనర్ మద్ది తిరుపతయ్య రైతు విభాగం అధ్యక్షులు సాంబశివారెడ్డి మామదాపురం సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి వైస్ ఎంపీపీ రుద్రపాడు శోభ నందనవనం ఎంపీటీసీ నారాయణస్వామి వైసిపి నాయకులు కటికల వెంకటరత్నం మాదిరెడ్డి కొండారెడ్డి వీరం రెడ్డి బ్రహ్మారెడ్డి పులి శీను పిల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

