*స్థానిక సమరం లో గట్టిగా ఉండాలి
*డిజిటల్ డైరీ లో లెక్కలు పక్కాగా ఉన్నాయి…
వచ్చేది మన ప్రభుత్వమే…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
తాడేపల్లి:
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖలో పార్టీకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు, నాయకులతో పాటు, ముఖ్య కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “
ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఎలా జరుగుతున్నాయి అన్న విషయం నాకన్నా కూడా చక్కగా, మీలో ఎవరికి మైక్ ఇచ్చినా బాగా మాట్లాడగలుగుతారు. గత మన ప్రభుత్వానికి, ఈ రెండున్నర ఏళ్ల వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పాలన మధ్య తేడాను ప్రజలు ఇప్పటికే గుర్తించారు. దేవుడి దయ వల్ల ఎవరూ చేయని విధంగా పరిపాలన చేశాం. మనం రాకముందు రాజకీయ నాయకులపై విశ్వసనీయత తీసుకొచ్చింది మనమే.మన ప్రభుత్వం రాకముందు మ్యానిఫెస్టో అంటే కేవలం ఒక బుక్ మాత్రమే. ఎన్నికల ముందు ప్రకటన. ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం చూశాం.అదే మ్యానిఫెస్టోను ఒక ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావిస్తూ, 99 శాతం అమలు చేసింది ఒక్క మన వైయస్సార్సీపీ ప్రభుత్వం మనదే. అలా రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత తీసుకొచ్చాం.గతంలో ఎవరూ చేయగలుగుతారా అనుకునే విధానం నుంచి చేయగలం అని చేసి చూపాం. గవర్నమెంటు స్కూళ్లు ప్రైవేటు స్కూళ్లకు థీటుగా తీర్చిదిద్దాం. నాడు–నేడు (మనబడి) కార్యక్రమంతో గవర్నమెంటు బడులను పూర్తిగా మార్చేశాం. ఇంగ్లిష్ మీడియమ్ ప్రవేశపెట్టాం. 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ ఇచ్చాం. బైలింగ్వువల్ టెక్సట్ బుక్స్. 6వ తరగతి నుంచే డిజిటలైజ్ బోర్డులు. 8వ తరగతి నుంచే ట్యాబ్‌లు.ఇవన్నీ రావడంతో, గవర్నమెంటు బడుల్లో నో వెకెన్సీ. చివరకు సీటు కోసం ఎమ్మెల్యేల సిఫార్సు చేయాల్సి వచ్చింది.అలా కేవలం మనం మాత్రమే చేయగలిగాం. చేసి చూపించాం.వైద్య ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లకు పెంచాం. పథకంలో వైద్యం ఖర్చును రూ.25 లక్షల వరకు పెంచాం.నాడు–నేడుతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చేశాం. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో నో వెకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. అన్ని పోస్టులు భర్తీ చేశాం. అందుకే గవర్నమెంటు ఆస్పత్రుల్లో సూపర్ స్పెషలిస్టుల కొరత దేశవ్యాప్తంగా 61 శాతం ఉంటే, అది మన దగ్గర కేవలం 4 శాతం మాత్రమే. గవర్నమెంటు ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన మందులు అందుబాటులో ఉంచాం. గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్స్ వచ్చాయి.ప్రతి పీహెచ్సీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు. ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు. ప్రతి డాక్టర్‌కు కొన్ని గ్రామాల అప్పగింత. ప్రతి మండలానికి ఒక 104 అంబులెన్స్. ఒక డాక్టర్ ఆస్పత్రిలో ఉంటే, మరో డాక్టర్ గ్రామాల్లో వైద్యం చేసే ప్రక్రియ.ఇవన్నీ సాధ్యం చేసి చూపిన ఘనత ఒక్క వైయస్సార్సీపీ ప్రభుత్వానిదే.వ్యవసాయ రంగంలోనూ కనీవిని ఎరగని మార్పులు తీసుకొచ్చాం.గ్రామాల్లో ఆర్బీకేలు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. వాలంటీర్లను నియమించాం. లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు అందజేశాం.వ్యవసాయంలో రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రతి ఎకరా ఈ–క్రాప్ చేసి, ప్రతి ఎకరాకు ఉచిత పంటల బీమా అమలు చేసి, ప్రతి ఆర్బీకేలో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను పెట్టాం. ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే, ఆ అసిస్టెంట్ అలర్ట్ అయి, జాయింట్ కలెక్టర్‌ను అప్రమత్తం చేసి సీఎం–యాప్ ద్వారా పంటల కొనుగోలు చేయడం జరిగింది.మన 5 ఏళ్ల కాలంలో రెండున్నర ఏళ్లు కోవిడ్. అయినా ఏ రోజూ సాకులు చెప్పలేదు. కారణాలు చూపలేదు. అన్నీ చేశాం. కనీవిని ఎరగని మార్పులు తీసుకొచ్చాం.మన హయాంలో ప్రతి గ్రామంలో సచివాలయంలో మహిళా పోలీస్ ఉండేది. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ ఉండేది.
ఈరోజు పరిస్థితి చూస్తే అంతా రివర్స్. అంతా అస్తవ్యస్తం.రూపాయికి చాక్లెట్ కూడా వస్తుందో. లేదో తెలియదు కానీ, 99 పైసలకే విశాఖలో భూములు ఇచ్చేస్తున్నారు.ప్రతి ఊరిలో మందుతో పాటు, గంజాయి దొరుకుతోంది. గుడి, బడి పక్కన ఇవన్నీ దొరుకుతున్నాయి. అదీ చంద్రబాబు పనితీరు.
నాడు గ్రామాల్లో మహిళా పోలీస్ ద్వారా వాటిని నియంత్రించగలిగాం. కానీ ఇప్పుడు యథేచ్ఛగా అన్నీ దొరుకుతున్నాయి.ప్రతి దానికీ లంచం. ఏ సర్టిఫికెట్ కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. అదే నాడు వాలంటీర్లు ఇంటికొచ్చి ఇచ్చే వారు.మరోవైపున ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఎన్నికల్లో పంపించిన బాండ్లు, ఇచ్చిన హామీలు, చేసిన ప్రమాణాలు గుర్తు చేస్తే.. ఓర్చుకోవడం లేదు. గత ప్రభుత్వంలో మనం ఇచ్చిన దాని కంటే మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పి మోసం చేశారు. ప్రతి ఇంటికి పోయి ఏమన్నారు. జగన్ ఇచ్చేది ఒక రూ.15 వేలు మాత్రమే. అదే చంద్రబాబు వస్తే, ఎంత మంది ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తాం. నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తామన్నారు.ఆడబిడ్డ నిధి కింద అమ్మ కనబడితే రూ.18 వేలు. ఇంకా మరో మహిళ కనబడితే ఆమెకు కూడా రూ.18 వేలు. ఇంకా ఎవరైనా పిల్లవాడు కనబడితే రూ.36 వేలు ఇస్తామన్నారు. ఎంత మంది ఉంటే, అంత మందికి రూ.36 వేల చొప్పున ఇస్తామన్నారు.ఇక ఊళ్లలో రైతులు, కండువాతో కనబడితే, జగన్ ఇచ్చేది రూ.13 వేలు మాత్రమే. అదే మేము వస్తే, పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేల చొప్పున ఇస్తామన్నారు.ఇంకా 50 ఏళ్లు దాటిని మహిళలకు నెలకు రూ.4 వేల చొప్పున ఏటా రూ.48 వేలు ఇస్తామన్నారు. అదే జగన్ ఇచ్చింది కేవలం రూ.18,750 మాత్రమే కదా అని ప్రచారం చేశారు.ఇంకా 2024 జూన్ నుంచే అన్నీ అమలు చేస్తామన్నారు. బాండ్లు పంపారు. స్వయంగా సంతకాలు చేశారు. అంతలా మోసం చేశారు. అందుకే ఇప్పుడు వాటిపై ప్రతి ఇంట్లో చర్చించుకుంటున్నారు.ఇంకా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. అంతులేని అవినీతి.ఇంకా చంద్రబాబుకు లింగ్ లిటిక్లు. ఆయనకు రోజూ భజన చేసే మీడియా. ఎల్లో మీడియా. గోబెల్స్‌ను మించి ప్రచారం. నిజం చెప్పాలంటే ఆయన గోబెల్స్‌ను మించి పోయాడు. ఒక అబధ్ధాన్ని నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్‌సిక్స్ అమలు చేయకపోయినా అన్నీ చేసినట్లు పచ్చి అబద్ధాలు.నిత్యం ప్రచారం.ఇక విశాఖ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మన హయాంలో ఏం చేశామనేది మీ అందరికీ తెలుసు.భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం. అదానీ డేటా సెంటర్ ఏర్పాటు ప్రక్రియ. ఏకంగా 1.30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇచ్చాం.కేజీహెచ్ బాగు పడింది కూడా ఒక్క మన హయాంలోనే.చివరకు ఎవరూ పట్టించుకోని ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు పరిష్కారంగా హీర మండలం నుంచి రూ.600 కోట్లతో తాగునీరు సరఫరా చేశాం.ఇంకా ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేశాం.అక్కడ ఎక్కడ, ఏ అభివృద్ధి అయినా జరిగింది కేవలం ఒక్క మన వైయస్సార్సీపీ ప్రభుత్వంలోనే.కాబట్టి, మనం చేసిన మంచి మనకు వెన్నంటి ఉంటుంది. దేవుడి దయ వల్ల, మనకు మంచే జరుగుతుంది. ప్రజల్లోకి మనం ఇంకా వెళ్లాలి. చంద్రబాబు ఏనాడూ ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయడు. మనకు తెలుసు. విశాఖలో మేయర్‌ను మార్చేశాడు. కాబట్టి ఇప్పుడు కూడా స్థానిక ఎన్నికలు సాఫీగా జరగనివ్వడు.చంద్రబాబు అధికార దుర్వినియోగం అక్రమాలు ఎలా ఉంటాయని చెప్పడానికి నంద్యాల ఉప ఎన్నిక ఒక ఉదాహరణ.కానీ, ఆ తర్వాత ఏం జరిగింది? అంతకు ముందు ఉప ఎన్నికలో అన్యాయం చేసి చంద్రబాబు గెల్చాడు. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో మనం 35 వేలకు పైగా మెజారిటీతో గెల్చాం.మన హయాంలో ఏరోజూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. పోలీసులను ఉపయోగించుకోలేదు.మనం చిత్తశుద్ధితో పని చేశాం. చెప్పినవన్నీ అమలు చేశాం. అందుకే మనం ఆధారపడింది పథకాల అమలు మీద. బటన్ నొక్కడం మీద.– అదే చంద్రబాబు చేసిన మంచి లేదు. కాబట్టి, ఆయన మొత్తం పోలీసులపై ఆధార పడతాడు. అక్రమ పద్ధతులు అవలంబిస్తాడు.గీతం వర్సిటీ. 55 ఎకరాల భూమి. కబ్జా చేశారు. దాని విలువ కనీసం రూ.5 వేల కోట్లు. దాన్ని అడ్డగోలుగా నచ్చిన వారికి, లోకేష్ తోడల్లుడికి ఇచ్చేశారు.ఆ స్థాయిలో బరి తెగించారు. అంత అవినీతి ప్రభుత్వం ఇది. అయితే ఇవి ఊర్కే ఎక్కడికి పోవు. తప్పకుండా చుట్టుకుంటాయి. పాపాలు ఎక్కడికి పోవు. కచ్చితంగా అనుభవిస్తారు.ఎన్నికల్లో గట్టిగా పని చేయండి. పార్టీ మీకు పూర్తిగా తోడుగా ఉంటుంది.ఏ పోలీస్ అయినా దౌర్జన్యం చేస్తే.. ఒక్కటే చెప్పండి. మూడేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మేమేమిటి అన్నది 5 ఏళ్లు చూపుతాం అని చెప్పండి.పోలీసుల దౌర్జన్యాలను డిజిటల్ డైరీలో రాయండి. మనం రాగానే, దాన్ని తెరిచి చర్య తీసుకుంటాం అని చెప్పండి.ముందు పోలీసులకు విజ్ఞప్తి చేయండి. అప్పటికి వినకపోతే, డిజిటల్ డైరీలో ఎంట్రీ చేయండి. ఆ తర్వాత సినిమా చూపుదాం. జగన్ 2.ఓ లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం.విశాఖలో తొలిసారిగా నీటి ఎద్దడి. పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉంటే మరో 75 టీఎంసీల నీరు స్టోర్ చేయొచ్చు. కానీ, చంద్రబాబు దాని ఎత్తు తగ్గించారు.ఒకవైపు అలా గోదావరి నీరు పోగొట్టుకుని, మరోవైపు విశాఖలో మూడు రోజులకు ఒకసారి కూడా నీరివ్వడం లేదు. మనం ప్రజల వద్దకు పోదాం. వారి సమస్యలపై పోరాడతాం.ది నాయకులు, కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలు. అందుకే గట్టిగా నిలబడండి. పోరాడండి. మీ అందరికీ పార్టీ పూర్తి తోడుగా ఉంటుంద”ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు

