కడప అర్బన్ :ఈనెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడమే కాకుండా శ్రమించి మన గెలుపు కోసం మీరు కృషి చేశారు అందుకు మీ అందరికీ పేరుపేరునా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఎం ఎల్ ఏ రఘు రామి రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వారి అధినాయకుడి ప్రోత్సాహకంతో గ్రామాలలో మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలను రెచ్చగొట్టే ధోరణికి సిద్ధమయ్యారు దాడులు చేస్తున్నారు అందువల్ల మీరందరూ అప్రమత్తంగా ఉండండి. సంయమనం పాటించండి.
ఎందుకంటే ఈ ఎన్నికలలో పోలీసువారి పాత్ర మనం మెచ్చుకోదగింది. సాధ్యమైనంత వరకు వారి కర్తవ్యాన్ని నిష్పక్షపాతంగానే నిర్వహించారు. కొన్నిచోట్ల పోలీసులు కొంత పక్షపాత వైఖరిని అవలంబించినప్పటికీ మీరు సంయమనం పాటించండి.
మనం ప్రజల మనసులో స్థానం సంపాదించాలి తప్ప ఎదుటి పార్టీ వారిని దూషించడం కానీ దాడులకు చేయడం గాని మన సిద్ధాంతం కాదు.
వారు ఎంత రెచ్చగొట్టినా….ఏం చేసినా….. సాధ్యమైనంత వరకు మీరందరూ ఓర్పు వహించండి చట్టం తన పని తాను చేస్తుంది.
*_కడప జిల్లా పోలీసుశాఖ వారు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. కాబట్టి దాడులకు తెగబడిన వారిని ఆయన చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. మీరందరూ సంయమనముతో ఓర్పు వహించండి అని ఎం ఎల్ ఏ రఘు రామి రెడ్డి అన్నారు.