పులివెందుల టౌన్ :పులివెందుల పట్టణంలోని 2వ వార్డ్ చిన్న కొండారెడ్డి కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ జే సి ఎస్ ఇంచార్జ్ పార్నపల్లికిషోర్, కౌన్సిలర్ గంగా లక్ష్మితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సెంటర్ లోని రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం పాలు, గుడ్లను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం అంగన్వాడీ కేంద్రాల్లో భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్ర కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రభు త్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ,వైకాపా నాయకులు కాలనీ రవి తదితరులు పాల్గొన్నారు.