వి.ఆర్.పురం
విజయవాడలో జరుగుతున్న ధర్నాలో అంగన్వాడీలను అరెస్టులు చేయడం దుర్మార్గం అని, జగన్ మొండి వైఖరి విరినాడాలని, తక్షణమే అరెస్టు చేసిన వంటి వాళ్ళని విడుదల చేయాలని, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పూనేం సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యల సాధన కోసం చేస్తున్న నిరసన సమ్మెలు సోమవారం నాటికి 42 రోజులకు చేరుకున్నాయి. ఈసందర్భంగా రేకపల్లి జంక్షన్ వద్ద అంగన్వాడి వర్కర్స్, హెల్పార్స్ కు మద్దతుగా సిపిఎం పార్టీ నాయకుల ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు, ఈ రాస్తారోకోను విజయవాడలో జరుగుతున్న ధర్నాకు మద్దతుగా నిర్వహించారు. ఈసందర్భంగా పలురు నాయకులు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, అంగన్వాడి ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మాఉద్యమాలను ఉదృతం చేస్తామని అన్నారు .ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కారం లక్ష్మి, సిఐటియు నాయకులు జిల్లా సహాయ కార్యదర్శి పూనెం సత్యనారాయణ, జిల్లా సభ్యులు సున్నం రంగమ్మ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, వల్ల కృష్ణారెడ్డి, ముసురు సత్యనారాయణ, రంగనాయకులు, మండల కార్యదర్శి వడ్లది రమేష్, ప్రజానాట్యమండలి సిహెచ్ సుబ్బారావు, అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.